Home EXCLUSIVE Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్...

Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

7
Rohit Sharma
Rohit Sharma Birthday

Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ  నేడు 37వ పడిలోకి  అడుగుపెట్టాడు. టీమిండియా హిట్‌మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేశాడు. వాటిలో కొన్నింటిని ఇప్పటికీ ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా బద్దలు కొట్టలేకపోతున్నారు.

చెరిగిపోని రికార్డులు..
రోహిత్ శర్మ తన బ్యాట్ తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా కొత్త రికార్డును సృష్టించాడు. 50 ఓవర్ల వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మనే.  ఈ రికార్డును మరే బ్యాట్స్ మెన్ కూడా చెరిపివేయలేకపోయాడు. ఇప్పటికే ఆ రికార్డు రోడహిత్ శర్మ పేరిటనే ఉంది. ఒక మ్యాచ్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిట ఉన్నది. 2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 173 బంతుల్లో 264 పరుగుల చేశాడు రోహిత్.

ఇందులో అత్యధికంగా 55 ఫోర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డు కెక్కాడు. పదేళ్లుగా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.  వెస్టిండీస్ పై 25 ఫోర్లతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు.  ఒకే సంంవత్సరలో ఐదు సెంచరీలో చేసి మరో రికార్డును క్రియేట్ చేశాడు. 2019లో వన్డేల్లో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన రోహిత్ ఐదు సెంచరీలు కొట్టాడు. నాలుగు సెంచరీలు చేసిన కుమార సంగక్కరను వెనక్కి నెట్టాడు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్  క్వింటాన్ డికాక్ సంగక్కర రికార్డును సమం చేశాడే తప్ప రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు.

హిట్ మ్యాన్ మన తెలుగోడే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ మన తెలుగువాడే. శర్మతల్లి పూర్ణిమా శర్మ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం. తండ్రి మహారాష్ట్ర వాసి. రోహిత్ కు మరాఠీయే మాతృభాష. కానీ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ చాలా బాగా మాట్లాడుతాడు.  మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో ఏప్రిల్ 30, 1987లో పుట్టాడు. తండ్రి గురునాథ్ శర్మ. రోహిత్ కు తమ్ముడు విశాల్ శర్మ ఉన్నాడు.

కుటుంబ నేపథ్యం
రోహిత్ తండ్రి ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పని చేసేవాడు. అర్ధంతరంగా తండ్రి ఉద్యోగం పోవడంతో కుటుంబ భారాన్ని రోహిత్ శర్మ మీద పడింది. ఇంతటి కఠిన పరిస్థితుల్లో అతడు ఇండియన్ ఆయిల్ కంపెనీతోపాటు రంజీ ట్రోఫీ కూడా ఆడుతూ కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. రోహిత్ క్రికెట్ ఆడటం తల్లి పూర్ణిమకు ఇష్టం లేదు. ఓ మంచి సంస్థలో అతడిపి ఉద్యోగిగా చూడాలనుకుంది. కానీ రోహిత్ శర్మ మాత్రం క్రికెటర్ కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంతోత పాటు ఏకంగా టీమిండియా కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు.