Home EXCLUSIVE Heroine Rambha : తెల్లని జుట్టుతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ రంభ!

Heroine Rambha : తెల్లని జుట్టుతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ రంభ!

22
Heroine Rambha
Heroine Rambha

Heroine Rambha : తెలుగు అమ్మాయిలు సినీ సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేరు అని అప్పట్లో అందరూ అనుకునేవాళ్లు. కానీ అది అబద్దం అని నిరూపించిన వారిలో ఒకరు రంభ. విజయవాడ కి చెందిన  ఈమె తన మొదటి సినిమాతోనే తన అందం మరియు యాక్టింగ్ టాలెంట్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మెప్పుని పొందింది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించిన ఈమె, అప్పట్లోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ హీరోలతో కూడా నటించింది.

2010 వ సంవత్సరం వరకు సినిమాల్లో యాక్టీవ్ గా ఉన్న రంభ ఆ తర్వాత ఇంద్ర కుమార్ అనే ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్ళాడి సినిమాలకు దూరం అయిపోయింది. మధ్యలో మీడియా కి దూరం గా ఉంటూ వచ్చిన రంభ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయింది. ఆమె రీసెంట్ లుక్స్ అందరినీ షాక్ కి గురి చేస్తుంది. తెల్లని జుట్టుతో స్టైలిష్ గా ఫారిన్ అమ్మాయిలాగా కనిపిస్తున్న రంభ, సినిమాల కోసమే ఇలా తయారైందని అంటున్నారు.