Home EXCLUSIVE Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

16
Weather Updates
Weather Updates

Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా ఉంది. ఏప్రిల్ ముగియకముందే కొన్ని ప్రాంతాల్లో దాదాపు 41 డిగ్రీలను తాకుతోంది. ఇక మే నెల మధ్య వరకు ఏ మేరకు పెరుగుతుందో ఊహించవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు రద్దీగాఉన్న రోడ్లు ఉదయం 11 గంటలకే ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సారి కొడుకుతున్న ఎండలు కొంత తీపి కబురు వినిపిస్తున్నాయి. అదేంటేంటే వర్షపాతం కూడా అదే రేంజ్ లో ఉందట.

ఈ సంవత్సరం (2024) నైరుతి రుతుపవనాల సీజన్‌ (జూన్‌ – సెప్టెంబరు) మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది. ఆగస్ట్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ‘లా నినా’ ప్రభావంతో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం(1970 – 2020) 87 సెంటీ మీటర్లు కాగా, ఈ ఏడాది 106 శాతం అధికంగా (సుమారు 92 సెం.మీ.) వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఐఎండీ వార్షిక తొలిదశ అంచనాల్లోనే దశాబ్దంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడుతున్నాయి. నైరుతి ప్రారంభం నాటికి వాటి ప్రభావం మరింత తగ్గుముఖం పడే అవకాశం కనిపిస్తుందని ఐఎండీ తెలిపింది. సాధారణ వర్షపాతానికి 29 %, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతానికి 31 %, అధిక వర్షపాతానికి 30 % అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.