Home EXCLUSIVE KKR Vs RR : కోల్ కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్ పై చేయి...

KKR Vs RR : కోల్ కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్ పై చేయి ఎవరిదో

18
KKR Vs RR
KKR Vs RR

KKR Vs RR : కోల్ కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న 31 వ మ్యాచ్ ఎక్కువ ఆసక్తి రేపుతోంది. పాయింట్స్ టేబుల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. రెండో స్థానంలో కొనసాగుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ లో ఎవరిది పై చేయి అవుతుందోనని సగటు క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు గెలిచిన ఆర్ ఆర్ మిగతా టీంలకు గట్టి పోటీనిస్తోంది. కోల్ కతా ఆడిన అయిదు మ్యాచ్ ల్లో నాలుగు గెలిచి రెండో స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగం సమష్టిగా రాణిస్తోంది. బ్యాటింగ్ లో సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఫామ్ లో ఉన్నారు. బట్లర్ ఒక మ్యాచ్ లో సెంచరీ చేసినా.. మిగతా మ్యాచ్ ల్లో పెద్దగా రాణించలేదు. యశస్వి జైశ్వాల్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చడం లేదు.

రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా.. కోల్ కతా 14 సార్లు నెగ్గగా.. 13 సార్లు రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. అయితే వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడవక తప్పదు. కోల్ కతా టీంలో నితీశ్ రాణా గాయంతో గత రెండు మ్యాచ్ లకు దూరమవగా.. రాజస్థాన్ తో మ్యాచ్ లో అయినా ఆడతాడా లేదా అనే సందేహం నెలకొంది.

కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు తమ చివరి మ్యాచ్ లో విజయం సాధించాయి. గత మ్యాచ్ లో కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ భీకర బ్యాటింగ్ తో లక్నో సూపర్ గెయింట్స్ పై అలవోక గా గెలిచారు.  మరి కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గెలుపు ఎవరిని వరించనుందో చూడాలి.