మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ మూవీ అగస్టు 11 వ తేదీన విడుదల కానుంది. దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ ప్రక్రియపై దృష్టి పెట్టింది.
దీనికోసం ఓ ఇంటర్వ్యూ లో హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్లు తమన్నా భాటియా, కీర్తి సురేశ్, డైరెక్టర్ మెహర్ రమేశ్ పాల్గొన్నారు. ఇందులో గెటప్ శ్రీను ప్రశ్నలు అడగగా చిరంజీవి, కీర్తి సురేశ్ ఇబ్బందులను ఎదుర్కున్నారు. దీనికి చిరంజీవి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
‘భోళా శంకర్’ లో హీరో చిరంజీవికి చెల్లె పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. అయితే తదుపరి చిత్రాల్లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే చేస్తారా అని గెటప్ శ్రీను ఈ ఇంటర్వ్యూ లో కీర్తి సురేశ్ ను అడిగాడు. దీనికి సమాధానం గా ఆమె తప్పకుండా చేస్తానని చెప్పింది. అయితే ‘భోళా శంకర్’ లో తన పాత్ర కు భిన్నంగా ఉండే పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలిపింది. కీర్తి ఇబ్బంది పడటం చూసి చిరంజీవి మధ్యలో కల్పించుకుని సమాధానం ఇచ్చాడు.
‘‘సహజంగానే నటీనటులు ఒక్కొక్క సినిమాలో ఒక్కో రకమైన పాత్రలు చేయాల్సి వస్తుంది. ఒక మూవీ లో ఒక హీరో కు చెల్లె గా చేసిన హీరోయిన్ తదుపరి చిత్రంలో సంబంధిత హీరోతో జతగా హీరోయిన్ పాత్రలో చేయవచ్చు కదా. ఈ సందర్భంగా అలనాటి హీరోహీరోయిన్లు సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి గురించి ప్రస్తావించాడు చిరంజీవి. వీరిద్దరు ‘రక్త సంబంధం’ సినిమాలో అన్నాచెల్లెలు గా నటించారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోహీరోయిన్ల పాత్రల్లో చేసి అభిమానులను మెప్పించగలిగారు. ఒక సినిమాలో అన్నాచెల్లెలుగా చేసినంత మాత్రాన అన్నీ మూవీల్లో ఇలానే చేయడం నాకు ఇష్టం లేదు’’ అని చిరంజీవి నవ్వుతూ సరదాగా అన్నారు.