
జపాన్ లో నిర్వహిస్తున్న జీ 7 సమ్మిత్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. హిరోషిమా నగరంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పాటు అక్కడ వివిధ దేశాల అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఆయన వెంట ఓ వ్యక్తి కీలకంగా కనిపిస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన కొనసాగుతున్నది. శనివారం ఆయన అమెరికా, జపాన్, ఉక్రెయిన్ తదితర దేశాల నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ పర్యటనలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలకంగా కనిపిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై చర్చించారు. ఈ సమస్య పరిష్కారానికి భారత్ చొరవ తీసుకుంటుందని చెప్పారు.
అయితే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పుడు మన దేశాని కీలక వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పర్యటనలో ఉంటారు. వివిధ దేశాల మధ్య భద్రతాపరమైన ఒప్పందాల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. ఇండియా నిర్వహించే కీలక సెక్యూరిటీ ఆపరేషన్లలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. దోవల్ ఏదేశంలో పర్యటించినా, ఏ రాష్ర్టంలో పర్యటించినా అది అత్యంత రహస్యంగా కొనసాగుతుంది. మూడో కంటికి తెలువకుండా ఆయన తన పనికానిచ్చేస్తారు అని కూడా అంటారు. ఆయన ప్రతి కదలికలో ఏదో అంతర్యముంటుందని భావిస్తారు. దేశానికి సంబంధించవిన భద్రతా పరమైన అంశంలో ఎక్కడా రాజీపడని వ్యక్తిగా దోవల్ కు పేరుంది. ప్రస్తుతం ఆయన ప్రధాని నరేంద్రమోదీతో కలిసి జపాన్ లో పర్యటించడం.. ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులతో సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భద్రతా పరమైన ఏవో కీలక చర్చల కోసమే ప్రధాని మోదీ ఆయనను జపాన్ కు తీసుకెళ్లారని అంతా భావివస్తున్నారు.