34.9 C
India
Saturday, April 26, 2025
More

    టీడీపీ అధినేతకు జగన్ మరోషాక్

    Date:

     

     

    ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పై చేయి కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు కు అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కరినీ కేసుల పేరిట వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లోగా చంద్రబాబు కు సంబంధించి అన్ని మూలాల మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
    కరకట్ట గెస్ట్ హౌస్ అటాచ్
    అధికారంలో ఉండగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివసించిన కరకట్ట గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ గెస్ట్ హౌస్ పై పడ్డారు. నదికి ఆనుకొని కట్టారని వివిధ కారణాలతో దానిని ఖాళీ చేయించారు. దీంతో పాటు ఆ పక్కనే కట్టిన ప్రజావేదికను కూడాకూల్చి వేయించారు.ఇప్పటి వరకు అక్కడ శిథిలాలు కూడా తొలగించలేదు. ఈ ఘటన అప్పట్లో రెండు పార్టీలమధ్య పెద్ద ఉద్రిక్తతలకు దారితీసింది.  క్రిమినల్ లా అమెండెమెంట్ 1994 చట్టం ప్రకారందీనిని ప్రస్తుతం అటాచ్ చేశారు. ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ గెస్ట్ హౌస్ చంద్రబాబుదికాదు . వ్యాపారి లింగమనేని అనే వ్యక్తిది. అటాచ్ విషయంపై స్థానిక జడ్జికి ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. క్విడ్ ప్రోక్రో ద్వారా దీనిని పొందారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రానున్నది తమ ప్రభుత్వమేనని గుర్చుకోవాలని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Duvvada Srinivas : వైయస్‌ఆర్‌సీపీ నుండి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్

    MLC Duvvada Srinivas : వైయస్‌ఆర్‌సీపీ పార్టీలో అంతర్గత క్రమశిక్షణ చర్యలు చోటుచేసుకున్నాయి....

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    16th Finance Commission : ఏపీకి ఎన్ని నిధులొస్తాయి.. 16వ ఆర్థిక సంఘం కీలక పర్యటన

    16th Finance Commission : ఆంధ్రప్రదేశ్‌లో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఏప్రిల్...

    TDP Leader : కొట్టుకున్న టీడీపీ నేతలు.. హార్సిలీ హిల్స్‌లో ఉద్రిక్తత

    TDP Leader : అన్నమయ్య జిల్లా హార్సిలీ హిల్స్‌లో టీడీపీ కార్యకర్తల...