
అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటూ ఒక ట్వీట్ చేశారు. నాన్న మీరెప్పుడు నాతోనే ఉన్నారు. ఒక ప్రేరణ రూపంలో, నా అన్ని జ్ణాపకాల్లో మీరున్నారు అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాంగ్రెస్ శ్రేణులు దీనిని రీట్వీట్ చేస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ రాహుల్ గాంధీ తన బాల్య జీవితాన్ని గుర్తు చేసుకున్నారని పలువురు చెబుతున్నారు.
రాజీవ్ గాంధీ 1944 అగస్టు 20న జన్మించారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత ఆయన పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 1984 అక్టోబర్ లో దేశానికి ప్రధాని అయ్యారు. 1989 అక్టోబర్ వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. 1991 మే 21న తమిళనాడులోని పెరంబుదూరులో ఎల్టీటీఈ మానవబాంబు రూపంలో ఆయనను హతమార్చింది.
ReplyForward
|