23.3 C
India
Thursday, January 15, 2026
More

    బీజేపీకి పడని తెలుగు ఓటు -జోరుగా కొనసాగుతున్న చర్చ

    Date:

     

     

     

     

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటుదిశగా కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తు్న్నది. అతిపెద్ద పార్టీగా ఆపార్టీ సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అంశంపై మరికాసేపట్లో సమావేశం కాబోతున్నది. మరి కొన్ని గంటల్లో సీఎం ఎవరనేది తేలనుంది. ఇప్పటికే అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలువస్తున్నాయి.  అయితే ఇప్పుడు ఓటింగ్ సరళిపై బీజేపీ లెక్కలు వేసుకుంటున్నది. తాము ఎక్కడ విఫలమయ్యామనేది తెలుసుకుంటున్నది.

    కమలానికి తెలుగు షాక్
    బీజేపీకి తెలుగు రాష్ర్టాల ప్రజలు షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తున్నది. కర్ణాటకలో దాదాపు ఎనిమిదికి పైగా జిల్లాల్లో తెలుగు వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో సుమారు 50 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. కాగా, ఇందులో కేవలం 6 నుంచి 7సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకున్నట్లు సమాచారం. బళ్లారి, చిక్ బళ్లాపూర్ లాంటి చోట్ల కూడా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తున్నారు.

    బీజేపీ పై తీవ్ర వ్యతిరేకతే కారణమా..
    కర్ణాటకతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగానే బీజేపీ ఓడినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు వారిలో కూడా ఇదే బీజేపీకి ఓటు వేయకుండా చేసిందని చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెబుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఇది కొంత నిరుత్సాహాన్ని కలిగించే అంశమేనని చెబుతున్నారు. ఇక మోడీ మానియాపై కొంత ఆలోచించే సమయం వచ్చిందని అంటున్నారు. మరి బీజేపీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగిందనే ప్రచారం కూడా సాగుతున్నది. ఇక తెలంగాణపై వారి దృష్టంతా పడిందని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....