37.3 C
India
Tuesday, April 16, 2024
More

    టీడీపీ అధినేతకు జగన్ మరోషాక్

    Date:

     

     

    ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పై చేయి కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు కు అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కరినీ కేసుల పేరిట వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లోగా చంద్రబాబు కు సంబంధించి అన్ని మూలాల మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
    కరకట్ట గెస్ట్ హౌస్ అటాచ్
    అధికారంలో ఉండగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివసించిన కరకట్ట గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ గెస్ట్ హౌస్ పై పడ్డారు. నదికి ఆనుకొని కట్టారని వివిధ కారణాలతో దానిని ఖాళీ చేయించారు. దీంతో పాటు ఆ పక్కనే కట్టిన ప్రజావేదికను కూడాకూల్చి వేయించారు.ఇప్పటి వరకు అక్కడ శిథిలాలు కూడా తొలగించలేదు. ఈ ఘటన అప్పట్లో రెండు పార్టీలమధ్య పెద్ద ఉద్రిక్తతలకు దారితీసింది.  క్రిమినల్ లా అమెండెమెంట్ 1994 చట్టం ప్రకారందీనిని ప్రస్తుతం అటాచ్ చేశారు. ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ గెస్ట్ హౌస్ చంద్రబాబుదికాదు . వ్యాపారి లింగమనేని అనే వ్యక్తిది. అటాచ్ విషయంపై స్థానిక జడ్జికి ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. క్విడ్ ప్రోక్రో ద్వారా దీనిని పొందారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రానున్నది తమ ప్రభుత్వమేనని గుర్చుకోవాలని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Sitarama Kalyana Mahotsavam : అమెరికాలో వైభవంగా శ్రీరామ చంద్రుడి కల్యాణ మహోత్సవం..

    Vasanth Navarathri & Sitarama Kalyana Mahotsavam : జగదభిరాముడు లోక...

    Dance Effect : డాన్స్ ఎఫెక్ట్.. ఎస్ఐ సహా 8 మందిపై వేటు..

    Dance Effect : భూపాల‌ప‌ల్లి జిల్లా, మ‌హ‌దేవ్‌పూర్ జ‌డ్పీటీసీ గుడాల అరుణ...

    KKR Vs RR : కోల్ కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్ పై చేయి ఎవరిదో

    KKR Vs RR : కోల్ కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్...

    350 Voters : అస్సాంలో ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు

    350 Voters in One Family : అస్సాంలో తొలి విడత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fishing : చేపల వేటకు రెండు నెలలు బ్రేక్

    Fishing Break : ఏపి ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై సోమవారం...

    Nara Lokesh : ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : నారా లోకేశ్

    Nara Lokesh : ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన...

    Nara Bhuvaneshwari : కురుక్షేత్రానికి సిద్ధమా? నారా భువనేశ్వరి పిలుపు

    Nara Bhuvaneshwari : మే 13న జరగబోయే కురుక్షేత్రానికి మీరు సిద్దమా.....

    Bhashyam Praveen : భాష్యం ప్రవీణ్ పెద్ద మనసు

    Bhashyam Praveen : పెదకూరపాడు మండలం తమ్మవరం గ్రామస్తులైన వంకాయలపాటి యాకోబు...