35.6 C
India
Friday, April 19, 2024
More

    మన నటుడికి మహా గుర్తింపు..

    Date:

    తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ శత జయంతి
    -అమెరికన్ నగర మేయర్ కీలక ప్రకటన
    భారత జాతి కీర్తించే తెలుగు వాడికి ఖండాంతరంలో కూడా అరుదైన గౌరవం దక్కింది. భారత జాతీ యావత్తు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మరువని పేరు శ్రీ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్). తెలుగునాట శ్రీకృష్ణుడు అన్నా, శ్రీరాముడు అన్నా ఆయనలో చూసుకునేవారు తెరపై ఏ పాత్ర అయినా ఆయన ముందు తలవంచాల్సిందే అంటే ఎలాంటి సందేహం లేదు. సీనియర్ హీరోయిన్ల వద్ద ఆయన అలాగే కనిపించే వారు.. ఇక ఆయనకన్నా వయస్సులో చిన్న హీరోయిన్లతో చేస్తే ఆయన అలాగే కనిపించే వారు. ఏది ఏమైనా భారత జాతికి ఆయనను ఇచ్చిన తెలుగు నేల ఎన్నటికీ తలెత్తుకునేలా చేసిన మహానుభావుడు.

    తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రతీ తెలుగింటి, కాదు కాదు.. యావత్ రాష్ట్రానికి అన్నగారు అయ్యారు. రూ. 2కే కిలో బియ్యం ఇచ్చి యావత్ దేశం చూపును ఆంధ్రప్రదేశ్ వైపునకు తిప్పిన మహానుభావుడు ఆయన. చిత్రసీమను విపరీతంగా ప్రేమించిన ఆయన టీడీపీలోని ప్రతీ కార్యకర్తను కూడా అలాగే ప్రేమించే వారు. ఆయన చూపు పడితే చాలు వారి రాత మారినట్లే భావించే వారు. జీవితం చరమాంకంలో ఎన్నో కష్టాలు అనుభవించిన ఎన్టీఆర్ అందరి మనస్సులో నిండిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ దేశ దేశాలు ఆయనను ఎన్నటికీ కీర్తిస్తుంటాయంటే అతిశయోక్తి కాదు.

    తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ శతజయంతి
    అమెరికన్ నగర మేయర్ కీలక ప్రకటన
    తెలుగు వారితో పాటు దేశం యావత్తు గర్వపడేలా అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్న నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, ఫ్రిస్కో నగర మేయర్ కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు ప్రజలందరూ అన్నగారిగా గౌరవించే  నందమూరి తారక రామారావు పుట్టిన మే 28వ తేదీని ప్రిస్కో నగర తెలుగు హెరిటేజ్ డేగా నగర మేయర్ జెఫ్ చేనీ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్‌నోట్‌ను కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని తెలుగు ప్రజలు ముందుకు తీసుకెళ్తు్న్నారని, అదే విధంగా దశ దిశలా ఆయన కీర్తిని చాటుతున్నారు. ఆయన శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో అమెరికా తరుఫున ఆయనకు గౌరవార్థంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెస్‌నోట్లో వెల్లడించారు. ఖండానికి ఆవలి వైపున ఉన్న అమెరికాలో నగర మేయర్ తెలుగు జాతి గుండెల్లో పెట్టుకున్న మహానుభావుడికి గౌరవార్థంగా తెలుగు హెరిటేజ్ డేగా ఆయన జయంతిని ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం.

    Share post:

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    NTR : కక్కినకూటికి ఆశపడని అభిమాన ధనుడు ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ చేవ చచ్చిందా..? సత్తా ఉడిగిందా..!

      ఎన్టీఆర్ అంటే నిలువెత్తు ఆత్మాభిమానం.. ఎన్టీఆర్ అంటే లీడర్, నెవర్ ఎ ఫాలోవర్...