
Sarfaraz
ఇన్ స్టా పిచ్చి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. రైలు వేగంగా వచ్చినప్పుడు ఇన్ స్టా రీల్ చేయాలని ఆశపడిన యువకుడు ఆ రైలుకు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దారుణం
హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
బాధితుడిని శ్రీరామ్ నగర్ రహ్మత్ నగర్‌కు చెందిన మదర్సా విద్యార్థి మహ్మద్ సర్ఫరాజ్ (16)గా గుర్తించారు.
రైల్వే ట్రాక్‌లపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ , వీడియోలను రికార్డ్ చేస్తూ రెహ్మత్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు సోషల్ మీడియాలో పెడుతుంటారు. శుక్రవారం ఇన్ స్టా రీల్స్ చేసేందుకు సనత్ నగర్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇన్ స్టా రీల్ చేస్తుండగా రైలు రాకను సరిగ్గా గమనించకపోవడంతో మహ్మద్ సర్ఫరాజ్ ను (16) రైలు ఢీకొట్టింది. దీంతో సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సనత్ నగర్ రైల్వే లైన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు మధ్యాహ్నం వీడియోలు తీస్తున్నప్పుడు రైలు వారిని ఢీకొట్టింది
సర్ఫరాజ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. వారి ఫోన్ కూడా స్పాట్ నుండి స్వాధీనం చేసుకుంది. మహ్మద్ సర్ఫరాజ్‌కు సోషల్ మీడియా ఖాతా కూడా ఉన్నట్లు విచారణలో తేలింది.
పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.







