
Sarath Babu Death : టాలీవుడ్ లో ఈ మధ్య వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. ఏదొక రూపంలో గత కొన్ని రోజులుగా విషాదాలే వింటున్నాం.. తాజాగా మన టాలీవుడ్ లో మరొక విషాదం చోటు చేసుకుంది.. మరొక స్టార్ నటుడు కన్నుమూశారు.. ఆయన ఎవరో కాదు సీనియర్ నటుడు శరత్ బాబు..
వెటరన్ యాక్టర్ శరత్ బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.. ఈయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తుంది.. దాదాపు 2 నెలలుగా ఈయన అనారోగ్యంగా బాధ పడుతున్నారు.
ఈ క్రమంలోనే ముందుగా బెంగుళూరు ఆ తర్వాత హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ప్రాణాలతో పోరాడి ఈ రోజు మరణించినట్టు డాక్టర్స్ ధ్రువీకరించారు.. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుము కున్నాయి..
ప్రస్తుతం శరత్ బాబు వయసు 71 సంవత్సరాలు.. 1974లో ఇండస్ట్రీ లోకి రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.. ఈయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.. ఇక శరత్ బాబు 5 దశాబ్దాలుగా సౌత్ లోని అన్ని భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈయన మరణవార్త విని అంతా నివాళిలు అర్పిస్తున్నారు.