
కర్ణాటకలోని బళ్లారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో నటి గీతా సింగ్ తనయుడు మరణించాడు. దాంతో గీతా సింగ్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది గీతా సింగ్. ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది గీతా సింగ్. హాస్య నటిగా పలు చిత్రాల్లో నటించింది. అయితే ఇటీవల కాలంలో గీతా సింగ్ కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
ఇక యాక్సిడెంట్ విషయానికి వస్తే…….. కర్ణాటక లోని బళ్లారి కి కారులో వెళ్ళింది నటి గీతా సింగ్. అన్నయ్య చనిపోవడంతో అన్నయ్య కొడుకులను గీతా సింగ్ దత్తత తీసుకుంది. కాగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో బళ్లారిలో భారీ యాక్సిడెంట్ జరిగింది. కాగా ఆ యాక్సిడెంట్ లో గీతా సింగ్ దత్తత తీసుకున్న కొడుకు , మేనల్లుడు చనిపోవడంతో గీతా సింగ్ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగింది. గీతా సింగ్ దత్త పుత్రుడు చనిపోయిన విషయాన్ని కరాటే కల్యాణి వెల్లడించింది.