
Adipurush tickets Cancelled : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ వరల్డ్ వైడ్ గా ఇటీవల రిలీజైంది. ఈ మూవీ కోసం డార్లింగ్ ప్యాన్స్ తోపాటు సినీప్రియులు వేయి కళ్ళతో ఎదురు చూశారు. ఈక్రమంలోనే సినిమా తొలిరోజే ‘ఆదిపురుష్’ ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్స్ ను బ్రేక్ చేసింది. తొలి రోజు ఈ మూవీ 150 నుంచి 160కోట్లు కలెక్ట్ చేస్తుందని అనిపించింది.
అయితే తొలి షో.. మ్యాట్నీ షో వరకు ఫ్యాన్స్ ఎగబడి చూడటంతో సినిమా పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈవినింగ్ షోతో ‘ఆదిపురుష్’ టాక్ పూర్తిగా మారిపోయింది. వాల్మికీ రామాయణానికి ‘ఆదిపురుష్’లో చూపించిన రామాయణానికి ఏ మాత్రం పొంతన లేదనే టాక్ బయటికి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ పర్వాలేదని అనిపించినా నార్త్ లో మాత్రం ‘ఆదిపురుష్’ పూర్తిగా నెగిజిట్ టాక్ వస్తోంది. ఈక్రమంలోనే నార్త్ లో ‘ఆదిపురుష్’ బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ‘ఆదిపురుష్’ టికెట్లను బుక్ చేసుకున్న పలువురు వాటిని రద్దు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన స్కీన్ షాట్లను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటంతో అవికాస్తా వైరల్ గా మారుతున్నాయి.






