AI News Readers : రోజు రోజుకు పెరుగుతున్న శాస్త్ర సాంకేతికత మానవాళికి తోడుగా నిలబడాలే గానీ, రోడ్డున పడేస్తుంది. కరోనా తర్వాత ఎన్నో వేల ఉద్యోగాలు పోయి. లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. కానీ ఇన్నాళ్లు ఒక్క మీడియా రంగం మాత్రం ఎంతో కొంత ఉద్యోగులను కాపాడుకుంటూ వస్తోంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, న్యూస్ రీడర్లను రోడ్డున పడేయకుండా కాపాడుకుంటుంది. ఇక ఆ రంగానికి కూడా ప్రస్తుతం కాలం చెల్లినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రింట్ మీడియా ఒక్కొక్కటిగా ప్రింట్ ను ఎత్తివేస్తూ వస్తుంది. ప్రపంచంలో టాప్ మోస్ట్ వీక్లీ అయిన ‘నేషనల్ జియోగ్రఫి’ తన ప్రింట్ ఎడిషన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఇక నుంచి నేషనల్ జియోగ్రఫీ వీక్లి డిజిటల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీడియా రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటలీజెంట్ (AI) ప్రవేశించింది. ఇక ఈ రంగాన్ని కూడా అది పూర్తిగా వశపరుచుకుంటుందని వాదనలు వినిపిస్తు్న్నాయి. ‘ఏఐ’ కారణంగా హాలీవుడ్ రైటర్స్ ఇప్పటికే పెన్ డౌన్ ప్రకటించారు. హాలీవుడ్ లో సినిమాలు చాలా వరకు నిలిచిపోయాయి. ఎంతో మంది రోడ్డున పడ్డారు కూడా. అయితే ప్రస్తుతం ఏఐతో న్యూస్ రీడర్లకు చెక్ మొదలైంది. కృత్రిమ న్యూస్ రీడర్ ప్రయోగాన్ని విజయవంతంగా సక్సెస్ చేయగలిగారు ఒక టెలివిజన్ సంస్థ యాజమాన్యం. దీంతో ఇక ముందు న్యూస్ రీడర్ స్థానంలో ఏఐ ఉంటుందని దీంతో ఆర్థికంగా కలిసి వస్తుందని సదరు సంస్థ యాజమాన్యం చెప్పడం కొసమెరుపు.
ఆర్టిఫిషియల్ ఇంటలీజెంట్ సాయంతో ఫిజికల్ గా న్యూస్ రీడర్ లేకుండా ఆర్టిఫిషియల్ న్యూస్ రీడర్ తో దేశంలోనే మొదటి సారి వార్తలు చదివించారు. ఇది సక్సెస్ కావడంతో ఇక ముందు ఇలానే ఉంటుందని యాజమాన్యం చెప్పారు. ఒడిశాలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ మహిళతో వార్తలు చదివించే విధానాన్ని OTV న్యూస్ ఛానల్ మొదటి సారి ప్రారంభించింది. ‘AI యాంకర్ లిసా అనేక భాషలు మాట్లాడగలదు. ప్రస్తుతానికి ఒడియా, ఇంగ్లిష్ భాషల్లో వార్తలను చదువుతుంది’ అని ఆ సంస్థ ఎండీ చెప్పారు. భవిష్యత్ లో AI యాంకర్లు వీక్షకుల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారని వారు చెప్పారు.