బాపట్ల జిల్లాలో విమానం ఇరుక్కుపోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఓ ట్రాలీలో విమానాన్ని తరలిస్తున్నారు. అయితే ఆ ట్రాలీ విమానం శనివారం రాత్రి బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల బైపాస్ రోడ్ లోని అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. కొచ్చిన్ నుండి ఈ విమానాన్ని హైదరాబాద్ కు ట్రాలీలో తరలిస్తున్నారు. ఇక ఈ పాత విమానం ఎందుకంటే ……. హైదరాబాద్ లో పిస్తా హౌజ్ అనే హోటల్ వాళ్ళు ఈ విమానంలో హోటల్ నడిపించాలని ప్లాన్ చేసారు.
వెరైటీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేసారు. పాత విమానాన్ని విడివిడి భాగాలుగా చేసి తరలిస్తున్నారు. అయితే అండర్ పాస్ రోడ్ లో ఇరుక్కుపోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత ట్రాలీ వెళ్లేలా చేయడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.