- జగన్ తో దోస్తీ ఫిక్సయ్యిందా..

Ambati Rayudu into AP politics : ప్రముఖ క్రికెటర్, రాష్ర్టానికి చెందిన అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారా..? ఆయన అధికార వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారా.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. అసలు రాయుడిపై ఇలాంటి ప్రచారం జరగడానికి కారణమెంటో తెలుసుకుందాం..
జగన్ ను కలిసిన అంబటి..
సీఎం జగన్ ను తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్ అంబటి రాయుడు గురువారం కలిశారు. గంట పాటు సీఎంతో మాట్లాడారు. ఇటీవల రాయుడు తరచూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కారును ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన క్రికెట్ అకాడమీ గురించే సీఎం ను కలిసినట్లు చెబుతున్నా, ఇందుకు అనుగుణంగా ప్రచారం జరుగుతోంది. ప్రజా సేవలో ఉండాలనుకుంటున్నట్లు గతంలో అంబటి ప్రకటించారు.