అనారోగ్యంతో వీధి కుక్క చనిపోయిందని జీహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టిన జంతు సంక్షేమ కార్యకర్త
పంజాగుట్ట – జీహెచ్ఎంసీ డాగ్ క్యాచర్ సిబ్బంది ఈ నెల 11న రెండు వీధి కుక్కలను పట్టుకెళ్లగా అందులో ఒక కుక్క చనిపోగా, మరొకటి అనారోగ్యం పాలైంది.
దీంతో వీధి కుక్కల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరించిన జీహెచ్ఎంసీ అధికారులు సహా 5గురి మీద జంతు సంక్షేమ కార్యకర్త కళానిధి పర్వత వర్ధనమ్మ ఫిర్యాదు చేయగా సెక్షన్ 11 యానిమల్ క్రూయాలిటీ కింద కేసు నమోదు చేశారు.