
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ అక్కినేని నాగేశ్వర రావు అభిమానులు ధర్నాకు దిగుతున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి అర్జున్ థియేటర్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించనున్నారు.
ఇటీవల బాలయ్య వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో అక్కినేని…… తొక్కినేని అంటూ మహా నటులు అక్కినేని నాగేశ్వర రావును విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు అలాగే అక్కినేని కుటుంబం కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా బాలయ్య తీరును తీవ్రంగా నిరసిస్తూ ఓ లేఖ విడుదల చేసారు. ఇక ఇప్పుడేమో అక్కినేని అభిమానులు బాలయ్య కు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈ వివాదం పై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.