
ఘోర ప్రమాదం జరిగింది దాంతో 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించారు. ఈ దారుణ సంఘటన ఈరోజు సిక్కిం లో జరిగింది. భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన చాటేన్ నుండి తంగా వైపుకు ట్రక్కు వెళ్తున్న సమయంలో మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో ఒక్కసారిగా లోయలో పడిపోయింది. దాంతో అక్కడికక్కడే 16 మంది జవాన్లు మరణించారు.
మరణించిన వాళ్లలో 13 మంది జవాన్లు కాగా ముగ్గురు ఆర్మీ అధికారులు ఉన్నారు. సరిహద్దుల్లో చైనా ఆక్రమణలకు పాల్పడుతుండటంతో నిరంతరం భారత సైన్యం గస్తీ కాస్తోంది. ఆ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దాంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 16 మంది ఇండియన్ ఆర్మీ మరణించడంతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు