
Jr NTR fans : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి ఇంటి నుండి వచ్చిన కూడా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు. ఈయన సినిమాల్లో ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్స్ తో ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు.. ఇంత ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈయన సినిమాలకు భారీ డిమాండ్ ఉంది.
ముఖ్యంగా ఎన్టీఆర్ కు మాస్ లో వీర లెవల్ ఫాలోయింగ్ ఉంది.. అందుకే ఈయన పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పట్టుకోలేం.. వీరి సందడి అంతా ఇంతా కాదు.. ఇక ఇటీవలే ఎన్టీఆర్ తన 40వ పుట్టిన రోజును జరుపు కున్నారు.. మే 20న ఈయన తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.. ఫ్యాన్స్ కూడా ఆ రోజు ఎక్కడ చూసిన సందడి చేసి తారక్ బర్త్ డే ను ఓ రేంజ్ లో జరిపారు.
అయితే అంత బాగానే జరిగింది అని అనుకునే లోపే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.. బర్త్ డే రోజు చేసిన రచ్చ కారణంగానే వీరు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ తారక్ ఫ్యాన్స్ ఏం చేసారు? వారిపై కేసు ఎందుకు నమోదు అయ్యింది? అనేది తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే..
ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు కొంత మంది అత్యుత్సాహం చూపించినట్టు తెలుస్తుంది. ఆ అత్యుత్సాహమే ఇప్పుడు వారిని జైలు పాలు చేసింది.. ఆయన పుట్టిన రోజు నాడు సింహాద్రి రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. ఆ రీ రిలీజ్ సందర్భంగా కృష్ణ జిల్లా మచిలీపట్నం లోని రెండు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ మేకలను మారణాయుధాలతో నరికి వాటి రక్తాన్ని ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై చిందించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు ప్రజలను మారణాయుధాలతో భయబ్రాంతులకు గురి చేసిన కారణంగా 8 మంది యువకులను అరెస్ట్ చేసారు..