ఢిల్లీ లిక్కర్ కేసు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్ళై ని అరెస్ట్ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఢిల్లీ మద్యం కేసులో రెండు రోజుల పాటు రామచంద్ర పిళ్ళై ని విచారించిన ఈడీ ఈరోజు అరెస్ట్ చేసింది. ఇక అరెస్ట్ చేసిన విషయాన్ని అధికారికంగా కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని వెల్లడించింది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా , ఎంపీ మాగుంట తనయుడు మాగుంట రాఘవ రెడ్డి తదితరులను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అటు ఈడీ ఇటు సీబీఐ దూకుడు పెంచాయి.
Breaking News