
Arupadi Veedu 5th Day : యూబ్లడ్ యాప్ ఫౌండర్, జై స్వరాజ్య టీవీ అధినేత డా.జై యలిమంచిలి ఆధ్మాత్మిక సేవ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. అమెరికాలోనూ ఆయన తన అధ్యాత్మిక.. ఇతర ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గత కొద్దిరోజులుగా అమెరికాలోని న్యూ జెర్సీలో సాయి దత్త పీఠం మరియు శ్రీ శివ విష్ణువు టెంపుల్ (SSPSSV) ఆధ్వర్యంలో ఆరుపాడై వీడు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపనం.. గణపతి పూజ.. యంత్ర ప్రతిష్ట.. విగ్రహ ప్రతిష్టాపన.. మహా పూర్ణాహుతి.. నీరాజనం.. మంత్రపుష్పం.. ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.






