
Aunt daughter in law fight : అత్తా కోడళ్ల లొల్లి గురించి తరుచూ చూడడం.. వినడం చేస్తూనే ఉంటాం.. ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు ఒక ఇంట్లో అత్తా కోడళ్లు కలిసి ఉండరనేది జగమెరిగిన సత్యం. ఒక వేల కలిసి ఉన్నారా.. అది ప్రపంచంలోని వింతే మరి. ‘త్తాలేని కోడలు ఉత్తమురాలు హోయమ్మా.. కోడలు లేని అత్త గుణవంతురాలు’ అని ఘంటశాల ఊరికనే పాడారా మరి.
ఇక్కడ అత్తా కోడలి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. చివరికి పోలీసులు కలుగజుసుకొని పంచాయతీని కోర్టు వరకు పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇద్దరి మాటల్లో ఏది నిజమో గానీ. వీరి గొడవను చూసేందుకు మాత్రం చాలా మందే గుమి కూడారు. సెన్సార్ తిట్లతో పాటు చీపురుతో దాడులు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అత్తా కోడళ్ల కొట్లాట చూస్తూ నెటిజన్లు తమకు తోచిన విధంగా సలహాలు, సూచనలు చేస్తున్నారు.
అయితే చాలా కాలం తర్వాత కోడలు నీళ్లోసుకుంది. దీంతో తన ఇంటికి వారసుడో.. వారసురాలో రాబోతోందని అత్త సంబురపడింది. కానీ ఆమె సంబురం మూడు రోజుల ముచ్చటైంది. మొదటి కాన్పు కావడంతో సంప్రదాయంగా తల్లి గారింటి వద్దే పురుడు పోసుకోవాలి. అందుకే పుట్టింటికి వెళ్లింది. అత్త కూడా అడ్డు చెప్పలేదు. కానీ అత్తకు తెలియకుండా ముందుగా చెప్పకుండా కోడలు అబార్షన్ చేయించుకుంది. విషయం తల్లికి తెలిసినా ఆమె కూడా వియ్యపురాలికి చెప్పలేదు. దీంతో కోపోద్రేక్తురాలైన అత్తగారు కోడలిపై దాడికి దిగింది.
చీపురు పట్టుకొని వియ్యపురాలు, కోడలుపై దాడి చేసింది. అడ్డువచ్చిన వారిపై కూడా విరుచుకుపడింది. కోడలి జుట్టు పట్టుకొని తింపుకుంటూ కొట్టింది. దీంతో చోద్యం చూసేందుకు ఇరుగు పొరుగువారు గుమికూడారు. సమాచారం పోలీసులకు తెలియడంతో వారు కూడా రంగ ప్రవేశం చేశారు. ఇద్దరి వైపున వివరాలు తెలుసుకున్నారు. అయితే, తీవ్రంగా బ్లీడింగ్ అవుతుండడంతో ఆందోళనగా హాస్పిటల్ కు వెళ్లానని, అక్కడ వైద్యుల సూచన మేరకే అబార్షన్ చేయించుకున్నానని కోడలు చెప్పింది. ఈ విషయం అత్తకు చెప్పేంత సమయం లేకపోవడంతో చెప్పలేకపోయానని కోడలు వెల్లడించింది. ఇదంతా తల్లే (వియ్యపురాలు) చేసిందని అత్త ఆగ్రహం వ్యక్తం చేసింది. నా ఇంటికి వారసులు లేకుండా చేస్తున్నారని మండిపడింది.






