
మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల క్రితం పూనకాలు వచ్చే అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ మేకర్స్.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగాస్టార్ ఆ వెంటనే తన నెక్స్ట్ సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రకటించిన విషయం విదితమే.. ఈ సినిమా షూట్ లోనే మెగాస్టార్ గత కొన్ని రోజుల నుండి బిజీగా ఉంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు చివరి దశకు చేరుకుంది.. రీమేక్ అయినప్పటికీ అన్ని హంగులను ఉండేలా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మొన్న టీమ్ చెప్పినప్పటి నుండే భోళా శంకర్ నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఆ సమయం రానే వచ్చింది.. ఈ రోజు చిరు నటిస్తున్న భోళా నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. ఈ ఫస్ట్ సింగిల్ నుండి ప్రోమో జూన్ 2న రాబోతుందట..
అలాగే ఈ పాట లిరికల్ సాంగ్ జూన్ 4న రాబోతుందని మేకర్స్ ఈ రోజు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.. వాల్తేరు వీరయ్య సినిమాలో పూనకాలు లోడింగ్ పాటకు ఎలా ప్రమోట్ చేసారో అదే విధంగా ఇప్పుడు ఈ ఫస్ట్ సాంగ్ కు చిరు కొత్త కొత్త పోస్టర్స్ తో హైప్ తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా చిరు వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు..
ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.. కాగా ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.