ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవ రాయులు పార్టీకి రాజీనామా చేయడంతో రాజకీయంగా వేడెక్కింది..ఇప్పటికే చాలా మంది వైసిపి నేతలు పార్టీని వీడి తమకు సీట్లు ఇచ్చే పార్టీలోకి చేరుతున్నారు. వైసిపి చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా గత కోద్ది రోజులు నుంచి పార్టీలో గంధరగోళం ఏర్పడింది. వరుసగా పార్టీ లో ఉన్న సీనియర్లు పార్టీని వీడుతున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని లావు శ్రీ కృష్ణ దేవరాయులు పేర్కొ న్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని స్పష్టంచేశారు.
గత కొద్దిరోజుల నుంచి శ్రీ కృష్ణ దేవరాయులు పార్టీ పెద్దల తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రావడం కష్టమేనని ఆయన భావించారు. గత 15 రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొందని శ్రీ కృష్ణ దేవరాయులు చెబుతున్నారు. తన టికెట్ విషయమై క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్ ఏర్పడిందని వివరించారు. అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతో పార్టీకి రాజీనామా చేశానని వివరించారు. నరసరావుపేటకు కొత్త అభ్యర్థిని తీసుకుని రావాలని హైకమాండ్ భావించింది. దాంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి, ఎంపీ పదవీకి రాజీనామా చేశానని స్పష్టంచేశారు. ఏ పార్టీలో చేరతాననే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు