
ఢిల్లీ లిక్కర్ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు కవిత బినామీ ని అని చెప్పుకున్న అరుణ్ రామచంద్ర పిళ్ళై ఒక్కసారిగా తిరుగుబాటు చేసి ఇప్పటి వరకు తాను ఇచ్చిన స్టేట్ మెంట్ లను విత్ డ్రా చేసుకుంటున్నట్లుగా కోర్టుకెక్కాడు. ఇదే ట్విస్ట్ అనుకుంటే మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఇంతకీ ఆ బిగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా…… ఇన్ని రోజులు ప్రభుత్వ లాయర్ గా వాదనలు వినిపించి నిందితులకు చుక్కలు చూపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రానా తన పదవికి రాజీనామా చేయడం. అంతేకాదు నిందితుల తరుపున వాదించడానికి సిద్ధమవ్వడం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన పదవికి రాజీనామా చేసి నిందితుల తరుపున వాదించడం అంటే లిక్కర్ కేసు ఫైల్ చేసిన సమయంలో …… ఆ కేసులో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయో తెలుసుకుని వాటినే ఆయుధంగా చేసుకొని వాదించడం అన్నమాట. అంటే ఢిల్లీ లిక్కర్ కేసు గోవిందా ……