28.6 C
India
Wednesday, September 16, 2026
More

    BJP and AAP : ఢిల్లీలో బీజేపీ, ఆప్ హోరాహోరీ..

    Date:

    BJP and AAP
    BJP and AAP

    BJP and AAP : ఉదయం 8 గంటలకు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం భారతదేశ పార్టీ పది స్థానాలలో, ఆప్ ఏడు స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నాయి. ఈనెల ఐదున ఢిల్లీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. 60.54% ఓటింగ్ నమోదయింది.. శనివారం కౌంటింగ్ మొదలైంది. దీనికోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకుంటామని భారతీయ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ 50 సీట్లు దక్కించుకొని అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఇప్పటికే ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పుతాయని .. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ నాయకులు అంటున్నారు.. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ల వారీగా పోలైన ఓట్ల జాబితాతో కూడిన ఫామ్ “17 సీ” సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ఆప్ డిమాండ్ చేసింది.

    అయితే ఎన్నికల సంఘం తమ విజ్ఞప్తిని తిరస్కరించడంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు.. ప్రతి బూత్ లో పోలైన ఓట్ల వారిగా వివరాలను వెల్లడించడానికి తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేశామని ట్విట్టర్ ఎక్స్ లో ఆయన వెల్లడించారు.. అదే కాదు బిజెపి నాయకులు తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై డబ్బుల వల విసిరారని.. 15 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.. దీనిపై బిజెపి కూడా అదే స్థాయిలో స్పందించింది. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు అందించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi Secretariat : ఢిల్లీ సచివాలయం సీజ్.. ఫైల్స్ భద్రపరిచేలా లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన ఆదేశాలు

    Delhi Secretariat : ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. లెఫ్టినెంట్ గవర్నర్...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    Delhi BJP : ఆఫ్‌ సెంచరీ కొట్టిన బీజేపీ..

    Delhi BJP : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ 70...

    Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?… లిస్టులో ఉన్నది వీరే?

    Delhi BJP : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నాలుగోసారి ఢిల్లీ పీఠాన్ని...