
లోక నాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు లోనయ్యాడు దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజుల నుండి కమల్ జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరానికి ఒళ్ళు నొప్పులు కూడా జత కావడం అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో చెన్నై లోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్ లో చేరాడు. ప్రస్తుతం కమల్ కు చికిత్స జరుగుతోంది. కమల్ ఆసుపత్రిలో చేరాడు అనే విషయం అభిమానులకు తెలియడంతో పెద్ద ఎత్తున కంగారు పడుతున్నారు.