బ్రేకింగ్ న్యూస్…… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈనెల 10 న ఢిల్లీకి రావాలని , విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ). ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతకొంత కాలంగా ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అరుణ్ రామచంద్ర పిళ్ళై ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ కవిత బినామీగా తేల్చింది. దాంతో కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇదే 10 వ తారీఖున ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష చేయాలని నిర్ణయించింది. కట్ చేస్తే అదే రోజున ఢిల్లీ లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ కావడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. కవిత ను ఈడీ అరెస్ట్ చేయనుందా ? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.