
తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ మామ పాకాల హరనాథరావు ( 72 ) గుండెపోటుతో మరణించాడు. నిన్న రాత్రి హరనాథరావు కు గుండెపోటు రావడంతో హుటాహుటిన గచ్చిబౌలి లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించాడు. డాక్టర్లు ఆయన్ని బ్రతికించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసారు కానీ లాభం లేకపోయింది. కేటీఆర్ భార్య శైలిమ తండ్రి హరనాథరావు. దాంతో కేటీఆర్ గచ్చిబౌలి చేరుకున్నారు. ఇక ఈరోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హరనాథరావు ఇంటికి చేరుకోనున్నారు.