బ్రేకింగ్ న్యూస్ …….. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవితకు ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన బుచ్చిబాబు పాత్ర ఉందని భావించిన సీబీఐ అతడ్ని అరెస్ట్ చేసింది. ఎమ్మెల్సీ కవితకు ఛార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు.
ఇప్పటికే ఈడీ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా అందులో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్ కావడంతో BRS నాయకుల్లో వణుకు మొదలైంది. కవితను కూడా అరెస్ట్ చేస్తారా ? అనే అనుమానం తలెత్తుతోంది.