
పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించడంలో అలాగే నిరుద్యోగులకు భరోసా కల్పించడంలో విఫలమైన TSPSC ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి అలాగే పూర్తి కమిటీ నిర్వహణలో పూర్తిగా విఫలమైందనే నిర్ణయానికి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఉన్న కమిటీ ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణికి మళ్లీ ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. అందుకే చైర్మన్ ను అలాగే మాజీ చైర్మన్ ను ప్రగతి భవన్ కు ఆహ్వానించి చర్చలు జరుపుతున్నారు మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు.