
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యకురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ఇల్లు అయిన ప్రగతి భవన్ ను ముట్టడించడానికి విఫలయత్నం చేసింది. అయితే ప్రగతి భవన్ ముందుకు వెళ్లాలంటే పెద్ద ఎత్తున ఆంక్షలు ఉంటాయి కాబట్టి హుటాహుటిన షర్మిల కారును ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
అయితే షర్మిల మాత్రం కారు నుండి కిందకు దిగకుండా నిరసన వ్యక్తం చేసింది. గంట నుండి కూడా కారులోనే ఉండటంతో కారు అద్దాలు పగులగొట్టి షర్మిలను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ లో ఇంత రాద్ధాంతం ఎందుకంటే …… నిన్న వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి పై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు షర్మిల క్యారవాన్ ను తగుల బెట్టారు. దాంతో ఇలా నిరసనకు దిగింది.