కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. భారీ విజయం సాధించడంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు హామీ ల అమలుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ విషయంలో కిలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సీద్ధరామయ్య ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. దీంతో సునీల్ కు కేబినెట్ హోదా లభించింది.
సునీల్ కనుగోలు కర్ణాటక కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఏకంగా పార్టీ 135 సీట్లు గెలుచుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. గత బొమ్మై ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. 40% కమిషన్ ప్రభుత్వం అంటూ తెరపైకి తెచ్చారు. పేటీఎం తరహాలో పేసీఎం అంటూ ప్రచార పోస్టర్లను రాష్ట్రవ్యాప్తంగా వెలిశాయి. ఇవన్నీ బీజేపీ పరాజయానికి కారణాలు అయ్యాయి.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా బజరంగ్దళ్ నిషేధంపై బిజెపి ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టారు. సునీల్ గతంలో టిడిపి, బీఆర్ఎస్ పార్టీలకు వ్యూహకర్తగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టికి కూడా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. సేవలను గుర్తించిన కాంగ్రెస్, సీఎం సిద్ధరామయ్య తనకు ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. దీంతో కర్ణాటకలో ఆయనకు క్యాబినెట్ హోదా లభించినట్లు అయింది మరి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో సునీల్ సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాలి.
ReplyForward
|