
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. స్పీకర్ హోదాలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబును ఫినిష్ చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలను సమన్వయం చేస్తూ హుందాగా వ్యవహరించాల్సిన స్పీకర్ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్కు అన్నీ తెలిసే ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతున్నందునే అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదనే స్పీకర్ వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది.
ముందుగానే దాడులకు ప్లాన్ ?
టీడీపీ అధినేత చంద్రబాబు ఎకక్కడకు వెళ్లినా అక్కడ దాడులకు దిగేందుకు వైసీపీ శ్రేణులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
వైసీపీ దుశ్చర్యకు వృద్ధుడు బలి
ఇటీవల ఎర్రగొండపాలెంలో టీడీపీ నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆ సభలో
ఉద్దేశపూర్వకంగానే రాళ్లదాడి చేశారు. సెక్యూరిటీని సైతం అడ్డుకున్నారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడగా, కొద్ది రోజులు చికిత్సపొందుతూ చనిపోయాడు. ఈ తరహ దాడులకు పరోక్షంగా పోలీసులు సహకరిస్తున్నారనే అపవాదు కూడా
ఉంది. ఇదంతా కుట్ర పూరితంగానే జరగుతున్నట్లుగా తెలుస్తున్నది.
పోలీసుల నిర్లక్ష్యం
చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నట్లుగా తెలుస్తున్నది. అధికార పార్టీ ఆదేశాల మేరకు వారు నడుచుకుంటున్నట్లు వెల్లడవుతున్నది. పాలకులు కూడా ఇటీవల తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీంతో తమకు ఎదురు నిలుస్తున్న వారిని అడ్డు తొలగించుకునే క్రమంలో భాగంగానే స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
భద్రతపై కేంద్రానికి సమాచారం?
బాబు భద్రతపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరుతున్నది. దేశంలోనే ఎవరికీ లేనంతగా జడ్ ప్లస్ సెక్యూరిటీ చంద్రబాబుకు ఉన్నది. కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్నా దాడులు జరుగుతున్న తీరు చూస్తుంటే అధికార పార్టీ ఆగడాలు ఏ స్థాయిలో మితిమీరుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వీటిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. దాడుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు నివేదిస్తున్నాయి. చంద్రబాబు పై కుట్రను కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు త్వరలోనే ఛేదిస్తాయని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.