25.1 C
India
Wednesday, March 22, 2023
More

    ఫిట్ నెస్ కోసం ఇంజక్షన్లు.. స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ సంచలన నిజాలు

    Date:

    చేతన్ శర్మ
    చేతన్ శర్మ

     

     

    బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అడ్డంగా బుక్కయ్యారు. మంగళవారం ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా సెలక్షన్ విషయాలను వెల్లడించారు. ఇందులో సంచలన నిజాలు బయటకు రావడంతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను పేలవ ప్రదర్శన తర్వాత చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీని బీసీసీ తొలగించింది. ఇటీవల మళ్లీ పునరుద్ధరించబడడంతో చేతన శర్మ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో విరాట్ కోహ్లీ మరియు జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లపై చేతన్ శర్మ సంచలన కామెంట్స్ చేశారు. జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు విరాట్ కోహ్లీతో తన అంతర్గత చర్చలను శర్మ వెల్లడించాడు.

    80 నుంచి 85 శాతం ఫిట్‌గా ఉన్నప్పటికీ చాలా మంది ఆటగాళ్లు పోటీ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని శర్మ ఆరోపించారు. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20I సిరీస్‌కు వెన్నుపూసకు ఫ్రాక్చర్ అయినా కూడా బుమ్రా తిరిగి రావడంపై అతనికి.. జట్టు మేనేజ్‌మెంట్ మధ్య అభిప్రాయభేదాలు భారీగా తలెత్తాయని చేతన్ ఆరోపించాడు. బుమ్రా ఇప్పటికీ ఆటలో కొనసాగడం లేదు. మొత్తం నాలుగు-టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్.. మూడు-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.

    మాజీ కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య ఇగో గొడవ ఉందని చేతన శర్మ ఆరోపించారు. ఇక రోహిత్ శర్మ సహా కొంతమంది 80శాతం ఫిట్ నెస్ ఉన్నా ఇంజక్షన్లు తీసుకొని 100శాతం ఫిట్ నెస్ సాధించామని జట్టులో కొనసాగుతున్నారని సంచలన విషయాన్ని బయటపెట్టారు.

    చేతన్ శర్మ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. జాతీయ సెలక్టర్లు కాంట్రాక్టుకు కట్టుబడి ఉన్నారని, మీడియాతో మాట్లాడకూడదని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. చేతన్ భవిష్యత్తు ఏమిటనేది బిసిసిఐ సెక్రటరీ జే షా నిర్ణయం తీసుకుంటాంరు. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేదా వన్డే మరియు టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంత జరిగాక చేతన్‌తో సెలక్షన్ మీటింగ్‌లో కూర్చోవడం అసాధ్యమే. మరి ఈ విషయంలో బీసీసీఐ చేతన్ శర్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచిచూడాలి.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...