చిరంజీవి హీరోగా, మెహర్ రమేశ్ దర్శకుడిగా తెరకెక్కిన మూవీ ‘భోళా శంకర్’. ఇది ఈ నెల (ఆగస్ట్) 11న రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. మూవీ టీమ్ మీడియాతో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు పంచుకుంది. ఇందులో భాగంగా ‘తనను చూసి దర్శకుడు మేహర్ రమేశ్ వణికిపోయేవాడు’ అని చిరంజీవి చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకు అలా జరిగిందని వివరించాడు మెగాస్టార్.
‘తమిళంలో ‘వేదాళం’కు రీమేక్ ‘భోళా శంకర్’. కొథలో కొద్దిగా మార్పులు చేశాడు దర్శకుడు మెహర్ రమేశ్. వేదాళం ఇప్పటి వరకు ఓటీటీలో కూడా రీలీజ్ చేయలేదు. ఇక మేహర్ రమేశ్ మంచి డైరెక్టర్ తన సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. నేను సెట్స్‌లోకి వచ్చిన వెంటనే ప్రొఫెషనల్‌గా మారిపోతాను. ఆ విషయం రమేశ్ కు కూడా తెలుసు. అందుకే నేను సెట్‌లోకి వస్తున్నానంటే వణికిపోయేవాడు. చలికాలంలో కూడా చెమటలు పట్టాయి ఆయనకు’ అంటూ చిరంజీవి సరదాగా చెప్పారు.
ఇక, కీర్తి సురేశ్ గురించి కూడా మాట్లాడాడు. ‘పున్నమినాగు’ సినిమాలో కీర్తి వాళ్ల అమ్మ (మేనక)తో కలిసి చేశాను. ఆ తర్వాత ఆమెతో చేసే అవకాశం రాలేదు. ఇక ఇప్పడు ఎక్కడ కలిసినా తను నేను కీర్తి సురేశ్ గురించే మాట్లాడుకుంటాం. ‘మహానటి’ షూటింగ్ సమయంలో కూడా చాలా విషయాలను మాట్లాడుకున్నాం. అందులో కీర్తి నటన చూసి ఆశ్చర్యం వేసింది. ఆమెకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సంతోషించాను. ఈ సినిమాలో మా మధ్య మంచి బంధం ఉంటుంది. కీర్తి నాకు చెల్లెలి పాత్ర వేసింది. తమన్నాను చూస్తే ముచ్చటేస్తుంది. ‘మిల్కీబ్యూటీ’ పాట చిత్రీకరణ సమయంలో ఆమె నాన్నకు సర్జరీ జరిగింది. ఫోన్ లో అప్ డేట్స్ తెలుసుకుంటూ నటించింది. అంత బాధను దాచుకొని మరీ డాన్స్ చేసింది. తనకు సినిమా అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఈ విషయం చాలు’ అని మెగాస్టార్ ఇద్దరి గురించి కీర్తించాడు.