మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భోళా శంకర్”.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది..
ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ పెంచగా.. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ ఈవెంట్ లో ఎన్నో విషయాలు హైలెట్ గా నిలిచాయి..
మరి ఇదే వేదికపై డైరెక్టర్ బాబీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టారు. చిరంజీవిని ఎవరేమన్నా కోపగించుకోరు.. కానీ తమ్ముళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకోరు.. ఎవ్వరికి తెలియని నేను విన్న ఒక విషయం చెబుతున్నాను.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమా షూటింగ్ ఒక ఇంటిలో జరుగుతుండగా ఒక వ్యక్తి చెప్పులు ఇంట్లోకి వేసుకుని రాగ ఇంటి ఓనర్ బూతులు తిట్టి వెళ్ళిపోమన్నారు.
ఈ విషయం విన్న పవన్ స్పందించగా అయినా ఓనర్ అవమానించడంతో షూటింగ్ ఆపేసి వెళ్లిపోయారు.. ఈ విషయం ఎక్కడో ఉన్న చిరుకి తెలిసి వెంటనే ఇంటి ఓనర్ కు కాల్ చేసి మాస్ వార్ణింగ్ ఇచ్చారు.. ”నా తమ్ముడిని ఎలా పో అంటావు.. నీ ఇంటి ఖరీదెంత.. నీకు కండిషన్స్ ఉంటే ఇంటికి తాళం వేసుకోవాలి కానీ షూటింగ్ కు ఇయ్యకూడదు’ అంటూ వార్ణింగ్ ఇచ్చారట. ఈ విషయం బయటకు చెప్పడంతో ఇది విని అంతా చిరుకి తమ్ముళ్లపై ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.
ReplyForward
|