
Civils 2022 topper : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫలితాల్లో టాపర్ గా నిషిత కిషోర్ కి నిలిచారు. మొత్తం 933 మందిని యుపిఎస్సి ఎంపిక చేసింది. జనరల్ కోటలో 345 మంది, ఈడబ్లూఎస్ 99, ఓబీసీ 263, ఎస్సీ 154, ఎస్టీ నుంచి72, ఉన్నారు. పలు సర్వీసు ల్లో వీరంతా శిక్షణ పొంది ఉద్యోగాల్లో చేరనున్నారు.
గతేడాది లాగే టాప్ ర్యాంక్ లు అమ్మాయిల కే దక్కాయి. నిషిత కిషోర్, గరిమా లోహియా, ఉమా హారతి, స్మృతి మిశ్రా వరుస నలుగు స్థానాల్లో నిలిచారు. తొలి నాలుగు ర్యాంక్ లు అమ్మాయిల కే దక్కడం విశేషం
తెలుగు విద్యార్థుల ఎంపిక..
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సత్తా చాటారు. పవన్ దత్తా, శ్రీ సాయి హర్షిత్, ఆవుల సాయి కృష్ణ, అనుగు శివ మారుతీ రెడ్డి, రాళ్లపల్లి వసంత్ కుమార్ కమతం మహేష్ కుమార్ రావుల జయసింహారెడ్డి, బొల్లం పీ మహేశ్వర్ రెడ్డి, చల్లా కళ్యాణి, విష్ణువర్ధన్ రెడ్డి, జీ సాయి కృష్ణ వీరగంధం లక్ష్మీ సుజిత, ఎన్ చేతన రెడ్డి , శృతి యారగట్టి, అప్పలపల్లి సుష్మిత, సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి బొల్లిపెల్లి వినూత్న ఉన్నారు. తెలంగాణలోని నారాయణపేటకు చెందిన నూకల ఉమా హారతికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు దక్కింది. ఈ మేరకు యూపీఎస్సీ ప్రకటించింది. తెలుగు విద్యార్థులు సివిల్ సర్వీసెస్ ఎంపికవడంపై సర్వత హర్షం వ్యక్తం అవుతున్నది.