
CM Jagan calls : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. కేంద్రం పెద్దలతో సీరియస్ మంతనాలు జరుపుతున్నారు. వరుస భేటీలతో ఏదో తేల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఢిల్లీ నుంచి తన కేబినెట్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 7న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం ఇంత సడెన్ గా కేబినెట్ మీటింగ్కు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతున్నది. ఏపీలో ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణ ఎన్నికలతో సహా ఏపీకి ఎన్నికలు జరిగేలా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై తనను ఓడించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి జగన్ ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ కూడా ఇందుకు సమ్మతించినట్లు తెలుస్తున్నది.






