
Manchiryala : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నూతన కలెక్టరేట్ భవనంతోపాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నాయి.






