
CM KCR meeting: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ లో కలవరం నెలకొంటుంది. కమిటీల ఏర్పాటు, సమావేశాలు, మాటలు, యుద్ధాలు ఇలా ప్రతీది పార్టీలో కనిపిస్తోంది. దీనిలో భాగంగానే కేసీఆర్ ప్రతీ నెల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక సారి ఎంపీలు, మరో సారి ఎమ్మెల్యేలు, ఇంకో సారి పార్టీ ప్రముఖులు ఇలా మీటింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు సమాచారం ఇచ్చిన పార్టీ అధినేత నెక్ట్స్ డేనే సమాచారం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతీ సారి ఏదో చెప్పాలని అనుకుంటున్న అధినేత ఆ విషయాలను చెప్పలేకపోతున్నారని పార్టీలో టాక్ వినిపిస్తుంది. అయితే బుధవారం ఆయన బీఆర్ఎస్ లెజిస్టేటివ్, పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందూ రావాలని అధినేత హుకుం జారీ చేశారు.
అయితే బుధవారం నిర్వహించే భేటీలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియక పార్టీ కేడర్ తర్జన బర్జన అవుతుంది. అధినేత నిర్వహించే సమావేశంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నాయకులు పలు అంశాలపై చర్చించుకుంటున్నారు. అయితే మొన్నటి వరకూ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తే ముందస్తు గురించి ఏమైనా చెప్తారా అని అనుమానాలు వ్యక్తమయ్యేవి. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోవడంతో దేని గురించి మాట్లాడుతారో తెలియదని చెప్తున్నారు. ఎలాంటి ముందస్తు లేకపోవడంతో వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు అధినేత ఒక వేళ ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచన అయితే ఉండదని అనుకుంటున్నారు.
గతంలో నిర్వహించిన సమావేశంలో అక్టోబర్ లో ఎన్నికలు వస్తున్నాయని అందరూ రెడీగా ఉండాలని ఆదేశించారు. కానీ ఇప్పడు డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. ఒక వేళ ప్రభుత్వాన్ని రద్దు చేసినా మరి కొన్ని నెలలు రాష్టపతి పాలన కొనసాగింది. ఐదు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు పెడతారు. ఒక్క తెలంగాణకే విడిగా పెట్టే అవకాశం లేదు. కేసీఆర్ ముందే చెప్పినట్లుగా నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ సారి టిక్కెట్లు కోల్పోయే నేతలకు నేతలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు జరగనున్నట్లు తెలుస్తుంది.