AP: వైఎస్ పేరును షర్మిల దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. వైఎస్ అనే పేరు వాడుకుని, ఆ కుటుంబం నుంచి వచ్చానంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఇలా చేయడం ద్వారా తనను తాను శాంతపర్చుకుంటున్నారని తాము భావిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎవరూ గందరగోళం చెందాల్సిన పనిలేదన్నారు. రాష్ట్ర హక్కులను రక్షించకుండా, ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడింత పోరాడాల్సిన అవసరమే ఉండదు కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.విభజన తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ లో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు బిజెపీపై ఓత్తిడి తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు.