
Congress towards victory Karnataka : కర్ణాటకలో విజయం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. 120కి పైగా స్థానాల్లో గెలుపు దిశగా చేయి పార్టీ పయనిస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి దూసుకుపోతున్నది. ప్రస్తుతం 125 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నది. ఇప్పటికే ఆరు రౌండ్లు ముగిశాయి. మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ప్రముఖ నేతలంతా విజయం సాధించారు. డీకేశివకుమార్, సిద్ధ రామయ్య విజయం సాధించారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై గెలిచారు. అయితే మోదీ ప్రచారం చేసిన 40 నియోజకవర్గాల్లో 25 కాంగ్రెస్ గెలుచుకోవడం ఇక్కడ చర్చనీయాంశంలా మారింది. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు చూస్తుంటే కన్నడిగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు అర్థమవుతున్నది. కాంగ్రెస్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉదయం నుంచి ముందంజలో ఉంది. మరి కొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.
పని చేయని మోదీ ఛర్మిష్మా..
ప్రధాని మోదీ స్వయంగా 40 నియోజకవర్గాల్లో ప్రచారానికి దిగినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఇందులో 25 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెల్చుకోవడం విశేషం. బీజేపీకి అన్నితానై ప్రధానే రంగంలోకి దిగి ప్రచారం చేసినా ప్రజలు ఆదరించకపోవడం 2024 ఎన్నికల కు ముందు కొంత బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నది. మీడియాతో మాట్లాడిన సీఎం బొమ్మై నిరాశతో కనిపించారు. ప్రజా తీర్పుపై సమీక్షించుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బెంగళూరులోని బీజేపీ కార్యాలయం బోసిపోయింది.
జేడీయూతో బీజేపీ మంతనాలు..
మరోవైపు బీజేపీ జేడీ యూతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతున్నది. కాంగ్రెస్ కనుక 130 సీట్లు గెలిస్తే వీరి ప్రభావం ఉండక పోవచ్చు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ కూడా సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. అయితే తాము కాంగ్రెస్ కు మద్దతునిస్తామని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో మాత్రం సంబురాలు మిన్నంటాయి.