- కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత
-

Sakalamma
Sakalamma : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తారని సమాచారం. సకలమ్మ మరణంపై కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.






