బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కి భారీ యాక్సిడెంట్ జరిగింది. దాంతో హుటాహుటిన ఆయన్ని హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. రోహిత్ శెట్టికి గాయాలు బాగానే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు విషయానికి వస్తే…… హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బాలీవుడ్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
ఆ సినిమా కోసం భారీ ఛేజింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజా సినిమా కోసం కూడా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రోహిత్ శెట్టి గాయాల పాలయ్యాడు.