Fans Fire on Devara Team: ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీ కాబట్టి.. దాదాపు ఎన్టీఆర్ సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్లకు పైగా అవుతుంది. అరవింద సమేత వీరరాఘవ 2018లో వచ్చింది. ఇన్నేళ్లల్లో తారక్ ఆర్ఆర్ఆర్ మాత్రమే చేశాడు. ఇక ఇది కూడా రిలీజైన రెండేళ్లకు గానీ దేవర: పార్ట్ 1 థియేటర్స్ లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇది ఆమె ఫస్ట్ స్ట్రెయిట్ ఫస్ట్ ఫిలిం., సైఫ్ అలీ ఖాన్ కు కూడా.. దేవర థియేట్రికల్ ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబట్టింది. నార్త్ లో సైతం దేవరకు భారీగా హైప్ వస్తుంది. యంగ్ టైగర్ కూడా దేవర ప్రమోషన్స్ సీరియస్ గా చేస్తున్నారు.
చెన్నై, బెంగుళూర్, ముంబై నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అన్నీ బాగానే ఉన్నా.. అప్డేట్స్ సమయానికి రాకపోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. దేవర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఈ రోజు (ఆదివారం-సెప్టెంబర్ 23) 11. 07 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తీరా చూస్తే విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ట్రైలర్ కోసం ఆశగా ఎదురు చూసిన అభిమానుల నిరాశే ఎదురైంది.
ఆయుధ పూజ సాంగ్ విషయంలోనూ ఇలానే జరిగింది. అది కూడా చెప్పిన సమయానికి అప్ డేట్ కాలేదు. చెప్పిన సమయానికి ఎందుకు రిలీజ్ చేయడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్ త్వరగా రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి.
దేవర టీమ్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్స్ లేవు. మరోవైపు యూఎస్ లో దేవరకు భారీ రెస్పాన్స్ దక్కుతుంది. రికార్డు స్థాయిలో ఫ్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడే దేవర రూ. 25 కోట్ల మార్క్ దాటుతుందని అంటున్నారు. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లు వసూలు చేస్తే కానీ హిట్ స్టేటస్ అందుకుందని సమాచారం.