
foreign Codes : ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ఖాతాల్లో ఉన్న డబ్బులు కొట్టేయడం, ఫేక్ కాల్స్ చేసి మోసగించడం ఇటీవ కాలంలో పెరిగిపోతోంది. ఫలితంగా మన డబ్బులు క్షణాల్లో మాయం అవుతున్నాయి. దీనిపై పోలీసులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. విదేశీ కోడ్స్ తో ఫోన్లు వస్తే రిజెక్ట్ చేయాలని చెబుతున్నారు. అలాంటి కాల్స్ వల్ల మనం మోసపోయే అవకాశం ఉంది.
ఇదివరకే ఎన్నో సంఘటనలు జరిగాయి. మోసాల్లో సరికొత్త మార్గాల్లో ప్రజలను కొల్లగొట్టేందుకు సైబర నేరగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే మన వివరాలు ఎప్పుడు ఎవరికి కూడా చెప్పొద్దు. మేం బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం అని మీ వివరాలు చెప్పాలని అంటే వెంటనే చెప్పేందుకు సిద్ధపడితే మన ఖాతా నుంచి క్షణాల్లో డబ్బులు మాయం అవుతాయి.
ఇప్పుడు కొత్తగా విదేశీ కోడ్లతో ఫోన్లు చేస్తున్నారు. దీంతో మనం ఫోన్ ఎత్తామంటే అంతేసంగతి. మోసాల్లో ఇదో మార్గం. ఇలాంటి ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు. జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున మన వివరాలు చెబితే మన అకౌంట్ లో డబ్బు పోతుంది. మనం కష్టపడి సంపాదించి దొంగల పాలు చేస్తే బాధ కలుగుతుంది. బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినా నమ్మకండి.
మోసాలను అరికడితే మన డబ్బుకు నష్టం ఉండదు. కానీ ఎవరో ఫోన్ చేస్తే మనకు తెలియకుండా మన వివరాలు వెల్లడిస్తే మోసానికి గురికావాల్సి వస్తుంది. పోలీసులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. విదేశీ కోడ్లతో వచ్చే ఫోన్లను అటాక్ చేయవద్దని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అంతం చేయాలి. సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వొద్దు. మనం కష్టపడి సంపాదించే డబ్బును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల వశం చేయకండని పోలీసులు సలహా ఇస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కాల్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
సరికొత్త నంబర్లతో ఫోన్లు చేసి వాటిని రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. విదేశీ నంబర్లతో ఇలా కొత్త రకమైన మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అలా చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని పట్టించాలి. అంతేకాని వారి బ్లాక్ మెయిల్ కు లొంగితే మన డబ్బులు మాయం అవుతాయని చెబుతున్నారు.






